ఎల్లెల్సీలో తగ్గిన నీటి ప్రవాహం
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్ల్సెల్సీ)లో శనివారం నీటి ప్రవాహం తగ్గింది. డ్యాంలో నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం తుంగభద్ర బోర్డు అధికారులు ఎల్లెల్సీకి నీటి సరఫరా నిలిపి వేశారు. హొళగుంద సెక‌్షన్ 181 కిలో మీటర్ వద్ద కాలువలో ప్రవాహం నిలిచిపోయింది. టీబీ డ్యాంలో శనివారం నాటికి 1.70 టీఎంసీల నీరు నిల్వ ఉంది.