tb dam
-
తుంగభద్రలో నీటి లభ్యత సగంలోపే!
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పుల కారణంగా తుంగభద్ర బేసిన్లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడం వల్ల తుంగభద్ర (టీబీ) డ్యామ్‌లో నీటి లభ్యత ఈ ఏడాది సగానికి పడిపోయింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు డ్యామ్‌లోకి 114.58 టీఎంసీల ప్రవాహం మాత్రమే వచ్చింది. తుంగభద్ర నదిలో వందేళ్ల ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని.. టీబీ డ్యామ్ వద్ద 75 శాతం లభ్యత ఆధారంగా 230 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా 1976లో వేసింది. దీన్ని బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ 2010లో ఖరారు చేసింది. కానీ.. రెండు ట్రిబ్యునళ్లు అంచనా వేసిన దాంట్లో సగం నీళ్లు కూడా ఈ ఏడాది టీబీ డ్యామ్‌లోకి చేరకపోవడం గమనార్హం. టీబీ డ్యామ్ చరిత్రలో 2016–17లో వచి్చన 85.71 టీఎంసీలే కనిష్ట ప్రవాహం. ఈ ఏడాది వచ్చింది రెండో కనిష్ట ప్రవాహం. శనివారం నాటికి టీబీ డ్యామ్‌లో 10.29 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 76.91 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. టీబీ డ్యామ్‌లో ఇదే సమయానికి గత పదేళ్లలో సగటున 50.60 టీఎంసీలు నిల్వ ఉండేవి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే గత పదేళ్లలో కనిష్ట నీటి నిల్వ ఉండడం కూడా ఇదే తొలిసారి. టీబీ డ్యామ్ నుంచి కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండడంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తున్నది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని.. నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో 3 రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తున్నది. ఈ ఏడాది నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో ఆయకట్టులో ఆరు తడి పంటలకు నీటిని సరఫరా చేశారు. 2019–20 నుంచి 2022–23 వరకుటీబీ డ్యామ్‌లోకి భారీగా వరద చేరడంతో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించారు. టీబీ డ్యామ్ చరిత్రలో గతేడాది అంటే 2022–23లో వచి్చన 606.64 టీఎంసీలే గరిష్ట వరద ప్రవాహం కావడం గమనార్హం. -
కేసీ కెనాల్ కోటా నీటి దోపిడీ!
సాక్షి, అమరావతి: తుంగభద్ర (టీబీ) డ్యామ్‌లో కేసీ కెనాల్ కోటా కింద దక్కాల్సిన జలాలు మన రాష్ట్ర సరిహద్దు చేరకుండా కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతోంది. నదిలో వరద తగ్గాక దామాషా పద్ధతిలో టీబీ డ్యామ్ నుంచి కేటాయింపుల ప్రకారం కేసీ కెనాల్‌కు విడుదల కావాల్సిన నీటిని చౌర్యం చేస్తోంది. ఈ నీటిని తుంగభద్రపై బళ్లారి జిల్లా సిరిగుప్ప తాలుకా సుగూరు వద్ద బొరుకా పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) 4.5 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన జలవిద్యుదుత్పత్తి కేంద్రం వద్ద నిల్వ చేస్తున్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రానికి ఎగువన అక్రమంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల ద్వారా కర్ణాటక సర్కార్ చౌర్యం చేస్తుండటం తాజాగా తుంగభద్ర బోర్డు, కేసీ కెనాల్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. దీంతో బీపీసీఎల్‌కు నోటీసులు ఇచ్చారు. నిబంధనల మేరకు నదిలో వరద ప్రవాహం ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలని, వరద లేనప్పుడు ఎలా విద్యుదుత్పత్తి చేస్తారంటూ నిలదీశారు. కర్ణాటక అక్రమంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల్లో నీటి తరలింపును ఆపివేశారు. బీపీసీఎల్ వద్ద నిల్వ చేసిన నీటిని దిగువకు విడుదల చేయించారు. వరద లేనప్పుడు విద్యుదుత్పత్తి చేస్తే విద్యుత్కేంద్రం అనుమతులను రద్దు చేస్తామని బోర్డు హెచ్చరించింది. కర్ణాటక ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేయడంతో ఎట్టకేలకు కేసీ కెనాల్‌కు వాటా జలాలు చేరాయి. 2.65 లక్షల ఎకరాలకు జీవనాడి.. కేసీ కెనాల్ కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ కెనాల్‌పై ఆధారపడి కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్రలో సుంకేసుల వద్ద 29.9 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కకట్టిన బచావత్ ట్రిబ్యునల్ మిగిలిన పది టీఎంసీలను వరద తగ్గాక టీబీ డ్యామ్ నుంచి విడుదల చేయాలని పేర్కొంది. టీబీ డ్యామ్‌లో నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో ఈ ఏడాది కేసీ కెనాల్‌కు 8 టీఎంసీలను బోర్డు కేటాయించింది. ఇందులో హెచ్చెల్సీ ద్వారా రెండు టీఎంసీలను విడుదల చేసింది. తుంగభద్ర పుష్కరాల సమయంలో నది ద్వారా 2.3 టీఎంసీలను విడుదల చేసింది. మిగతా 3.7 టీఎంసీల కోటాను మార్చి 25 నుంచి రోజుకు 2,500 క్యూసెక్కుల చొప్పున టీబీ డ్యామ్ నుంచి బోర్డు విడుదల చేసింది. అయితే ఈ నీటిని బీపీసీఎల్ వద్ద నిల్వ చేయించిన కర్ణాటక సర్కార్ ఎగువన ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. దీంతో టీబీ డ్యామ్ నుంచి విడుదల చేసిన జలాలు కేసీ కెనాల్‌కు చేరడం లేదు. ఈ నేపథ్యంలో టీబీ బోర్డు అధికారులు, కేసీ కెనాల్ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయడంతో కర్ణాటక జలచౌర్యం బహిర్గతమైంది. -
ఎగువన పరవళ్లు.. దిగువన దుర్భిక్షం
కర్నూలు సిటీ : జిల్లాలోని పశ్చిమ ప్రాంతాన్ని కరువు వెన్నాడుతోంది. ఏ పల్లెలో చూసినా వలస బతుకుల దీనగాథలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం కలిసిరాక బీడు పడిన భూములు దర్శనమిస్తాయి. తుంగభద్ర డ్యాంలో నీరు నిండుగా ఉన్నా..ఈ ప్రాంతాన్ని దుర్భిక్షం వీడడం లేదు. ప్రభుత్వంలో నూ చలనం రావడం లేదు. జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ కింద 1.4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. డ్యాంలో పూడిక, ఆవిరి పేరుతో యేటా నీటి వాటాను తగ్గిస్తూ తుంగభద్ర బోర్డు అధికారులు ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఫలితంగా 40 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరందుతోంది. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఆయకట్టు కంటే ఎక్కువగా సాగవుతోంది. అక్రమ ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందుతున్నాయి. కొందరు బోర్డు అధికారులు రైతుల వద్ద మామూళ్లు తీసుకొని జల చౌర్యాన్ని ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నారు. అధికారులు వసూలు చేసే మామూళ్లలో కొంత మొత్తం అధికార పార్టీ ప్రజాప్రతినిధులకూ వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎందుకీ దుస్థితి.. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాయలసీమలోని కరువు రావడంతో ఎంతో మంది పోరాటాలు చేసి తుంగభద్ర డ్యాం సాధించుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు తరువాత కర్ణాటక పరిధిలోకి ఆ డ్యాం వెళ్లింది. ఆ తరువాత కొనేళ్ల పాటు సాగు, తాగు నీరు సమృద్ధిగానే అందింది. అయితే కొన్నేళ్లుగా.. కర్ణాటక రాష్ట్రంలో ప్రవహించే ఎల్లెల్సీ, టీబీ బోర్డు పరిధిలోని కాలువకు ఇరువైపులా ఉన్న వారు అడ్డగోలుగా నీటిని చౌర్యం చేస్తున్నారు. కొందరు ఇంజినీర్ల అక్రమార్జన తోడు కావడంతో పాటు వచ్చిన సొమ్ములో టీడీపీ ప్రజాప్రతినిధులకు వాటాలుగా ఇస్తుండడంతో జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువకు కేటాయించిన నీరు రావడం లేదు. ప్రతి ఏటా జల చౌర్యాన్ని అడ్డుకుంటామని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెబుతన్నా.. ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు దిగువకు నీరొచ్చేదేప్పుడు? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం. 212 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు నేడు 100 టీఎంసీలకు సామర్థ్యం తగ్గింది. ఈ డ్యాంలో ఎల్లెల్సీ( కర్ణాటక, ఏపీ)కి 43 టీఎంసీల నీటిని కేటాయించారు. దిగువ కాలువ 1800 క్యుసెక్కుల ప్రవాహ సామర్థ్య ఉంది. మొత్తం 348.2 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఇందులో డ్యాం నుంచి 131.5 కి.మీ వరకు కర్ణాటక పరిధిలోను, 131.5 కి.మీ నుంచి 148.0 కి.మీ వరకు ఏపీలోను, 148.0 కి.మీ నుంచి 156.0 కి.మీ వరకు కర్ణాటక, 156.0 కి.మీ నుంచి 188.0 కి.మీ ఏపీలో, 188.0 కి.మీ నుంచి 190.8 కి.మీ వరకు కర్ణాటక, 190.8 కి.మీ నుంచి 250.580 కి.మీ వరకు ఏపీ పరిధిలోని ప్రవహిస్తోంది. ఏపీ పరిధిలో ప్రవహించే ఈ కాలువ 250.58 కి.మీ వరకు టీబీ బోర్డు పరిధిలో ఉంది. 250.58 కి.మీ దగ్గక ప్రధాన కాలువలో 725 క్యుసెక్కుల నీటి ప్రవాహాన్ని చూపించాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది. అయితే బోర్డు పరిధిలోని కాలువ సైట్లో 14 మంది ఇంజినీర్లు పని చేస్తున్నారు. వీరంతా ఏపీకి చెందిన వారే. 30 కి.మీ నుంచి 156.0 కి.మీ వరకు అధికంగా నానాయకట్టు సాగవుతోంది. మిగతా కాల్వ పరిధిలో కొంత తక్కువగానే సాగవుతోంది. ఈ ఏడాది ఎల్లెల్సీకి 17 టీఎంసీల నీటిని కేటాయించారు. గత నెల 18వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నా ఇంత వరకు ఏపీ సరిహద్దులో 250 క్యుసెక్కుల నీటి ప్రవాహం కూడా లేదు. ఎమ్మిగనూరు తరువాత వచ్చే కాలువలోని నీటి ప్రవాహం డిస్ట్రిబ్యూటరీలకు కూడా అందడం లేదని ఇంజినీర్లే చెబుతున్నారు. జిల్లాలో వర్షాలు లేకపోవడంతో ఎండుతున్న పంటలకైన ఎల్లెల్సీ నీరు వస్తుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. వసూళ్లు ఇలా...! కర్ణాటక పరిధిలోని కాలువ కింద 37,518 హెక్టార్లు(92,670 ఎకరాలు) స్థీరికరించిన ఆయకట్టు ఉంది. అయితే ఇంతకు రెండింతలు అక్రమ ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌లోని ఆయకట్టుకు ఎకరానికి రూ.300నుంచి రూ. 500 వరకు, నానాయకట్టుకు రూ.500నుంచి రూ. 1000 చొప్పున కొందరు ఇంజినీర్లు రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రకారం ఒక్క ఖరీఫ్‌లోనే రైతుల నుంచి రూ.5కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటాం: తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీకి 2,500 క్యుసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో కాలువ ప్రవహించే ప్రాంతం లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉండడంతో ఎక్కువ నీటిని వాడుకుంటున్న మాట వాస్తవమే. జల చౌర్యం గతంలో కంటే భాగా తగ్గింది. చింతకుంట దగ్గర 600 క్యుసెక్కుల వరకు కాల్వలో నీటి ప్రవాహం ఉంది. 134 నుంచి 184 కి.మీ మధ్య అధికంగా నీటిని వినియోగిస్తున్నట్లు ఇటీవల కాల్వపై పర్యటించిన సమయంలో గుర్తించాం. ఆయకట్టుకు, నానాయకట్టుకు వేరు వేరు గా డబ్బులను రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే లస్కర్లకు, ఇంజనీర్లకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశాం. ఒక వేళ ఎక్కడైన వసూలు చేసినా, చేస్తున్నా, రైతులను బలవంతం పెట్టినా ఫిర్యాదు చేస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం. – వెంకట రమణ, టీబీ డ్యాం ఎస్ఈ -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం) ఉపరితలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా జలాశయంలో ఇప్పటికే 42.33 టీఎంసీలకు పైగా వరద చేరుకుంది. 133 టీఎంసీల సామర్థ్యమున్న టీబీడ్యాం.. పూడిక వల్ల 100 టీఎంసీలకే నిండుకుండలా తొణికసలాడుతుంటుంది. అయితే డ్యాంలో ఎప్పటికప్పుడు నీటిని దిగువకు విడుదల చేయడం ద్వారా ఈ ఏడాది 130 టీఎంసీల కన్నా ఎక్కువ నీరందే అవకాశాలున్నట్లు అంచనా. 22 తర్వాత హెచ్చెల్సీకి నీరు దామాసా ప్రకారం 19 టీఎంసీల వరకు హెచ్చెల్సీకి నీరు అందుతుందని భావిస్తున్నా.. టీబీ డ్యాం ఉపరితలంలో కురుస్తున్న భారీ వర్షాలకు 20 టీఎంసీల వరకు నీరు అందే సూచనలు ఉన్నాయి. ఈ నెల రెండో వారం ప్రారంభంలోనే జలాశయానికి 42.33 టీఎంసీల నీరు చేరుకుంది. దీంతో హెచ్చెల్సీకి ఈ నెల 22 నుంచి 25వ తేదీ మధ్యలో నీటిని విడుదల చేసే సూచనలు ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నారు. దీంతో హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు ఈ నెల 20 నాటికి పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నీటి లభ్యత పెరిగే అవకాశం జలాశయం ఎగువ ప్రాంతాలైన కర్ణాటకలోని అగుంబె, శివమొగ్గ, హరిహర, తీర్ధహాళ్లి తదితర ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తుండడంతో డ్యాంకు ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉంది. జలాశయం నీటి మట్టం 1632 అడుగులు కాగా, ఆదివారం నాటికి 1613.47 అడుగులకు చేరుకుంది. 7661 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సాధారణంగా జలాశయంలోకి 40 టీఎంసీల నీరు చేరాక వాటా ప్రకారం హెచ్చెల్సీకి ఆరు టీఎంసీలు విడుదల చేస్తారు. జలాశయానికి నీటి లభ్యత మరింత పెరిగే అవకాశం ఉండడంతో హెచ్చెల్సీకి అదనంగా నీటిని విడుదల చేసే అవకాశమున్నట్లు రైతులు భావిస్తున్నారు. నీటి విడుదలపై మల్లగుల్లాలు గత ఏడాది ఆలస్యంగా నవంబర్ ఒకటి నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో పంటలు సాగు చేసిన రైతులు దిగుబడి లేక తీవ్ర నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది ఇప్పటికే నీటి విడుదలకు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ తేదీల ఖరారుపై మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు, కర్ణాటకలో మరమ్మతు పనుల పురోగతిపై అంచనాలు వేసి నీటి విడుదల తేదీ ఖరారు చేయనున్నారు. ఆధునికీకరణ పనులను ఈ నెల 20వ తేదీ నాటికి నిలిపివేసే విధంగా కాంట్రాక్టర్లకు సూచిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నాటికి నీటిని కర్ణాటక సరిహద్దు దాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటకలోనూ ఆంధ్ర సరిహద్దు వరకు చేపట్టిన కాలువ మరమ్మతు పనులను ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేసి, 20న నీటి విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. కర్ణాటకతో కలిసి నీటిని తీసుకుంటాం హెచ్చెల్సీకి కర్ణాటకతో పాటు నీరు విడుదల చేసుకోవాలని భావిస్తున్నాం. ఇరు రాష్ట్రాలు ఒకేసారి ఇండెంట్ ఇవ్వడం వల్ల నీటి ప్రవాహ నష్టాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ నెల 20వ తేదీ నాటికల్లా కర్ణాటకలో కాలవ మరమ్మతు పనులు పూర్తి కానున్నాయని బోర్డు వర్గాలు తెలిపాయి. దీంతో 20వ తేదీ తరువాత కర్ణాటక నిర్ణయం పరిగణనలోకి తీసుకొని నీరు విడుదల చేసుకోవాలని భావిస్తున్నాం. దీనిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించనున్నాం. సాధ్యాసాధ్యాలు పరిశీలించి నీటి విడుదల తేదీ ఖరారు చేస్తాం.– మక్బుల్ బాషా, ఇన్చార్జి ఎస్ఈ -
చిగురిస్తున్న ఆశలు
టీబీ డ్యామ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న నీటిమట్టం ఆరుతడి పంటలపై రైతుల ఆశలు హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలోని కణేకల్లు, బొమ్మనహళ్, డి.హీరేహళ్, విడపనకల్లు మండలాల్లో 36వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాంత రైతులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. వ్యవసాయం తప్ప మరో ప్రత్యామ్నాయం వీరికి తెలియదు. ఖరీఫ్ ఆరంభంలో టీబీ డ్యామ్‌లో నీటి మట్టం అధ్వానంగా ఉండేది. అప్పటి పరిస్థితిని బట్టి సాగుకు నీరివ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. టీబీ డ్యామ్‌కు ఇన్‌ఫ్లో పెరిగి... నీటి నిల్వలు పెరిగితే ఆలోచిద్దామన్నారు. ప్రస్తుతం తాజాగా టీబీ డ్యామ్ ఇన్‌ఫ్లో 5,756వేల క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 72.410 టీఎంసీలకు చేరుకుంది. గత వారంలో డ్యామ్‌కు వరద భారీగా చేరింది. ఈ క్రమంలో ఆయకట్టు రైతుల్లో ఆశలు రోజురోజుకూ చిగురిస్తున్నాయి. 29 వేల ఎకరాల్లో తడి భూమి వరికెలాగూ సాగునీరివ్వలేమని గతంలె అధికారులు చెప్పడంతో హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలో 90శాతం మంది రైతులు వరిసాగు చేయలేదు. బోర్లున్న రైతులు మాత్రం అడపాదడపా వరి సాగు చేపట్టారు. ప్రస్తుతం డ్యామ్‌లో నీటి నిల్వ పెరుగుతుండటంతో ఆరుతడి పంటల సాగుకైనా నీరివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హెచ్ఎల్యంసీ పరిధిలోని 36వేల ఎకరాల ఆయకట్టులో 29వేల ఎకరాలు తడి భూమి, 7వేల ఎకరాల ఆరుతడి భూమి ఉంది. ఈ భూమిలో వరి పంటల సాగుకోసం 2.5 టీఎంసీల నీరు అవసరముండేది. ప్రతి ఏటా హెచ్‌ఎల్‌ఎంసీకి 2.5 టీఎంసీ నీటిని కేటాయించేవారు. ఈ నీళ్లతో సరిపెట్టుకుంటూ రైతులు వరి సాగు చేసేవారు. ఆరుతడి పంటలకైతే అంత నీళ్లు కూడా అవసరం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఒకటి నుంచి ఒకటిన్నర టీఎంసీల నీరున్నా చాలంటున్నారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఆయకట్టుకు నీరిస్తే ఆ నీళ్లతోనే ఆరుతడి పంటలు పండించుకుంటామంటున్నారు. స్పందించని మంత్రి కాలవ టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత ప్రకారం హెచ్చెల్సీకి 13 టీఎంసీల వరకు నీరొచ్చే అవకాశముంది. తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు పోను మరో 3 టీఎంసీలు కూడా వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీ కింద ఆరుతడి సాగుకు నీరివ్వాలని రైతులు కోరుతున్నారు. ఆరుతడి పంటల సాగుకు ఇప్పుడే సరైన సమయమని.... డ్యామ్‌లో నీటి మట్టం ఆశాజనకంగా ఉన్నందున ఆయకట్టుకు సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు తమ బాధను చెప్పుకుంటున్న అధికారుల్లో మాత్రం స్పందన కన్పించడం లేదు. మంత్రి కాలవ శ్రీనివాసులు సైతం నోరు విప్పడం లేదు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆరాటపడుతున్నా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై రైతుల్లో అసహనం వ్యక్తమవుతోంది. -
హెచ్చెల్సీకి నీటి విడుదల
బొమ్మనహాళ్/హోస్పేట: జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ కాలువకు బుధవారం తుంగభద్ర మండలి అధికారులు నీటిని వదిలారు. హెచ్చెల్సీ కాలువకు సంబంధించిన రెండు గేట్లకు తుంగభద్ర మండలి కార్యదర్శి డి.రంగారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.లక్ష్మప్ప, అసిస్టెంట్ కార్యదర్శి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గేట్లకు సంబంధించిన స్విచ్ ఆన్ చేసి కాలువకు నీటిని విడుదల చేశారు. ప్రారంభంలో వంద క్యూసెక్కుల వరకు నీటిని వదిలారు. గంట గంటకు వంద క్యూసెక్కుల వరకు నీటి సామర్థ్యాన్ని పెంచుతూ మొత్తం 500 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా మండలి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తుంగభద్ర మండలి ఇంజినీర్ శ్రీనివాస నాయక్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఏటా ఇబ్బందే
– ఆరుతడి పంటల సాగుకూ కటకటే – తీవ్రంగా నష్టపోతున్న అనంత ఆయకట్టు రైతులు – అసలు విషయాన్ని గుర్తించడంలో ప్రజాప్రతినిధుల వైఫల్యం – నేడు సాగునీటి సలహా మండలి సమావేశం అనంతపురం సెంట్రల్: తుంగభద్ర జలాశయానికి చేరుతున్న నీటిని కర్ణాటక ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపింది. దీని కోసం అనంత ఆయకట్టు రైతులు, ప్రజల ప్రయోజనాలను తొక్కి పెడుతోంది. న్యాయబద్ధంగా మనకు రావాల్సిన నీటిని రాబట్టుకోవడంలో జిల్లా ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. జలాశయంలో 60 టీఎంసీలకు పైగా నీరున్నా ఇంట వరకూ జిల్లాకు చుక్క నీరు విడుదల కాలేదు. ఇప్పటికే జిల్లాలో తాగునీటి ఇబ్బందులు పెరిగిపోయాయి. చిత్రావతి ఒట్టిపోవడంతో జిల్లాలోని ధర్మవరం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలతోపాటు వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల ప్రాంతాల ప్రజలు దాహార్తీతో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం బుధవారం మధ్యాహ్నం స్థానిక రెవెన్యూ భవన్లో జరగనుంది. పూడిక పేరుతో అన్యాయం అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి అరకొర నీటిని విడుదల చేస్తుండడంతో నీటి పంపిణీలో న్యాయం చేకూరడం లేదు. ప్రాజెక్ట్ కర్ణాటకలో ఉండడం వల్ల ఆ ప్రాంత రైతులకు ఎక్కువ శాతం లబ్ధి చేకూరుతోంది. జలాశయం ద్వారా హెచ్చెల్సీకి 32.05 టీఎంసీల నీరు అందాల్సి ఉంది. అయితే జలాశయంలో పూడిక చేరిక, ఉపరితల ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు సాకుగా చూపుతూ నీటి కేటాయింపుల్లో కర్ణాటక ప్రభుత్వం భారీగా కోత పెడుతోంది. సగటున 22 టీఎంసీల నీరు కూడా జిల్లాకు అందకుండా పోతోంది. ఫలితంగా జిల్లాలో హెచ్చెల్సీ ఆయకట్టు నానాటికీ తీసికట్టులా మారుతోంది. 1.80 లక్షల ఎకరాల ఆయకట్టులో 50 వేల ఎకరాలు కూడా సాగుకు నోచుకోవడం లేదు. 20 రోజులు మాత్రమే నీటి విడుదల హెచ్చెల్సీ ప్రధాన కాలువ కర్ణాటకలో 100 కిలోమీటర్ల మేర ఉంది. 105 కిలోమీటర్ వద్ద జిల్లాలోకి అడుగుపెడుతుంది. జలాశయంలో 40 టీఎంసీల సామర్థ్యం దాటితో నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తుంటారు. ఏటా జూన్, జులైలో నీటి విడుదల జరుగుతుండేది. ఈ సారి మాత్రం ఆగస్టు ముగుస్తున్నా నీళ్లు విడుదల చేయలేదు. తాజాగా ఆరుతడి పంటలు సాగు చేయడానికి సీజన్ దగ్గర పడడంతో బుధవారం నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో జలాశయం నుంచి జిల్లాకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం అందించారు. అయితే ఇది కూడా కేవలం 20 రోజులు మాత్రమే నీటి విడుదల ఉంటుందని తేల్చి చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోనున్నారు. రెండేళ్లుగా బీళ్లు నీళ్లుంటే బంగారు పంటలు పండే ఆయకట్టు భూములు రెండేళ్లుగా బీళ్లు పడ్డాయి. కనీసం ఆరుతడి పంటలు కూడా పండించుకోలేని దుస్థితి నెలకొంది. ప్రతి ఏటా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా నీటి విడుదల చేయాలని టీబీబోర్డు అధికారులను జిల్లా అధికారులు కోరడం.. వారు పెడచెవిన పెట్టడం పరిపాటిగా మారుతోంది. దీనికి తోడు కర్ణాటకలోని హెచ్చెల్సీ ప్రధాన కాలువ 100 కిలోమీటర్లు మేర ఆ రాష్ట్ర రైతుల జలచౌర్యానికి అడ్డు లేకుండా పోతోంది. ఐదేళ్లలో హెచ్చెల్సీకి వచ్చిన నీళ్లు : సంవత్సరం వచ్చిన నీళ్లు (టీఎంసీలలో) 2012–13 19.247 2013–14 26.455 2014–15 22.520 2015–16 16.997 2016–17 10.327 (ఇప్పటి వరకు) -
సాగుకు నీరివ్వలేం!
హెచ్ఎల్సీ కింద పంటలు వద్దు - నార్లు పోసుకుని నష్టపోతే మేం బాధ్యులం కాదు - టీబీ డ్యామ్ పరిస్థితిని అర్థం చేసుకోండి - డీఈఈ రామసంజన్న కణేకల్లు: ‘‘తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ దారుణంగా ఉంది. హెచ్ఎల్సీ ద్వారా ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి లేదు. వచ్చే నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తాం. రైతులు తాజా పరిస్థితిని అర్థం చేసుకోవాలి.’’ అని కణేకల్లు హెచ్ఎల్సీ సబ్ డివిజన్ డీఈఈ రామసంజన్న అన్నారు. స్థానిక హెచ్ఎల్సీ అతిథి గృహంలో శుక్రవారం సాగునీటి సంఘం అధ్యక్షుల సమావేశం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు కేశవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఈ మాట్లాడుతూ తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో వర్షం సమృద్ధిగా కురవకపోవడంతో డ్యాంకు ఇన్‌ఫ్లో బాగా తగ్గిందన్నారు. ప్రస్తుతం నీటి మట్టం 1,613 అడుగులు కాగా.. 41.312 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. దామాషా ప్రకారం హెచ్ఎల్సీకి వచ్చే నీళ్లు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతాయన్నారు. రైతులు ముందుగానే వరినార్లు పోసుకున్నాం.. నీళ్లివ్వండని డిమాండ్ చేసినా ఫలితం ఉండబోదన్నారు. అందుకు తాము బాధ్యులం కామన్నారు. కర్ణాటకలో శనివారం టీబీ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నారని.. ఆ తర్వాత నీటి విడుదల ఆధారంగా హెచ్ఎల్సీ కోటాను తీసుకుంటామన్నారు. ప్రత్యేకించి నీళ్లు తీసుకుంటే కర్ణాటక రైతులు జల చౌర్యానికి పాల్పడే అవకాశం ఉందన్నారు. ఏఈఈ నరేంద్ర మారుతి మాట్లాడుతూ బోర్లు లేకపోతే పంటల జోలికి వెళ్లకపోవడమే మేలన్నారు. సాగుకు నీరివ్వలేమనే విషయాన్ని కరపత్రాలు, పత్రికల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. నాన్ ఆయకట్టును చూస్తూ ఊరుకోం ప్రస్తుత పరిస్థితిని తాము అర్థం చేసుకోగలమని.. అయితే నాన్ ఆయకట్టు రైతులు హెచ్ఎల్సీ నీటిని చోరీ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, రైతులతో కలిసి షట్టర్లను ధ్వంసం చేసి అయినా నీళ్లు పారించుకుంటామని ఉద్దేహాల్ బ్రాంచ్ కాలువ టీసీ మెంబర్ అప్పారావు అన్నారు. హెచ్ఎల్సీ పొడవునా నాన్ ఆయకట్టు రైతులు కాలువ గట్ల మధ్యే పైపులు వేశారని.. యూటీల వద్ద కూడా పైపులు ఉన్నాయన్నారు. చాలా మంది పట్టపగలే కాలువపై మోటార్లు పెట్టి నీళ్లను చోరీ చేస్తూ దర్జాగు పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఆ విషయాన్ని మేం చెప్పలేం పంటలు సాగు చేయొద్దనే విషయాన్ని తాము ఆయకట్టు రైతులుకు చెప్పలేమని డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు కేశవరెడ్డి తెలిపారు. సాగునీటి కోసం రైతులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని.. ఈ క్రమంలో పంటలు సాగు చేయవద్దని ఎలా చెప్పగలమని ఆయన ప్రశ్నించారు. - కేశవరెడ్డి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు -
టీబీ డ్యాంలో పెరుగుతున్న నీటిమట్టం
బొమ్మనహాళ్ : టీబీ డ్యాంలో నీటిమట్టం పెరిగినట్లు జలాశయం సిబ్బంది గురువారం తెలిపారు. జలాశయం పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నీటిమట్టం ఆశాజనకంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిసే ఇన్‌ప్లో 15వేలు దాటిందని.. ఇదేవిధంగా మరో 20 రోజులు నీరు వచ్చి చేరితే ఆయకట్టుకు ఊపిరి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
జలకళ
హొళగుంద: జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రదాయిని అయిన తుంగభద్ర రిజర్వాయర్‌కు జలకళ వచ్చింది. ఎగువ ప్రాంతంలోని శివమొగ్గ, ఆగుంబే తదితర ప్రాంతల్లో వర్షాలు పడుతుండడంతో రెండు రోజుల నుంచి డ్యాంలోకి వరద నీరు చేరిక పెరుగుతోంది. ఈ నెల 27 న డ్యాంలో 1338 క్యూసెక్కుల నీరు చేరగా శుక్రవారం నాటికి 14,275 క్యూసెక్కులకు పెరిగింది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే జూలై 15 తర్వాత దిగువ కాలువ (ఎల్లెల్సీ)కి నీటి విడుదల పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలిపారు. -
టీబీ డ్యామ్‌కు 165 టీఎంసీల నీరు రావొచ్చు
– ఎల్లెల్సీకి 18.796, కేసీకి 7 టీఎంసీలు వచ్చే అవకాశం - బోర్డు అధికారుల అంచనా కర్నూలు (సిటీ):వాతావరణ శాఖ సూచనల ప్రకారం వర్షపాతం 95శాతం నమోదైతే తుంగభద్ర జలాశయానికి ఈ ఏడాది 165 టీఎంసీల నీళ్లు వచ్చే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు అంచనా వేశారు. బుధవారం హోస్పేట్లో టీబీ డ్యామ్ అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డ్యామ్ ఎస్ఈ శశిభూషణ్‌రావు, కర్నూలు ఎస్ఈ చంద్రశేఖర్‌రావు, తుంగభద్ర ఎగువ కాల్వ, జహిరాబాద్ ఇంజనీర్లు పాల్గొన్నారు. తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్లెల్సీ)కు 18.7 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 7.7 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. గత ఏడాది 152 టీఎంసీల నీరు వస్తుందనుకోగా ఆస్థాయిలో నీరు రాలేదు. ఎల్లెల్సీ కాల్వ పరిధిలో రూ.8 కోట్లతో 49 టెలిమెట్రీ మీటర్ల ఏర్పాటుకు బోర్డు అధికారులు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఎల్లెల్సీ కాల్వ ఎక్కడైనా లీకేజీ అయితే వెంటనే వాటి మరమ్మతులు చేయనున్నారు. -
ఎల్లెల్సీలో తగ్గిన నీటి ప్రవాహం
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్ల్సెల్సీ)లో శనివారం నీటి ప్రవాహం తగ్గింది. డ్యాంలో నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం తుంగభద్ర బోర్డు అధికారులు ఎల్లెల్సీకి నీటి సరఫరా నిలిపి వేశారు. హొళగుంద సెక్షన్ 181 కిలో మీటర్ వద్ద కాలువలో ప్రవాహం నిలిచిపోయింది. టీబీ డ్యాంలో శనివారం నాటికి 1.70 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ఎల్లెల్సీకి నీరు విడుదల
– తాగునీటి కోసమే అంటున్న అధికారులు – సాగునీటికి ఇప్పట్లో విడుదల లేనట్లే – టీబీ డ్యాంలో నీటి నిల్వ 40.9 టీయంసీలు కర్నూలు సిటీ: తాగునీటి అవసరాల కోసం కర్ణాటక రాష్ట్రం హŸస్పేటలోని తుంగభద్ర జలాశయం నుంచి తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కి గురువారం 690 క్యుసెక్కుల నీరు విడుదల చేశారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులు ఉండడంతో జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్.. టీబీ బోర్డుకు ఇండెంట్ పెట్టారు. టీబీ బోర్డు అధికారులు స్పందించి నీరు విడుదల చేశారు. పశ్చిమ ప్రాంతంలో 15 రోజులుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. సాగు చేసిన పైర్లు వాడు ముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లెల్సీకి నీరు విడుదల చేశారనే విషయం తెలియగానే రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే అవి తాగునీటి అవసరాలకేనని అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. తుంగభద్ర డ్యాంకు 20 రోజుల్లోనే 36 టీ.యం.సీల నీరు వచ్చి చేరినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో 40.9 టీయంసీలు నిల్వ ఉంది. ఏపీతోపాటుæ కర్ణాటక ప్రభుత్వం ఇండెంట్ పెట్టడంతో బోర్డు అధికారులు స్పందించి ఎల్ఎల్సీ కాల్వకు ఏపీ వాటా కింద 690, కర్ణాటక వాటా 650 క్యుసెక్కుల నీటిని విడుదల చేశారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 165 గ్రామాల ప్రజలకు ఎల్లెల్సీ తాగు నీటి అవసరాలు తీరుస్తోంది. తుంగభద్ర దిగువ కాల్వ కింద జిల్లాలో 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది 90 వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తామని ఇటీవలే జల వనరుల శాఖ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఈ ఏడాది దిగువ కాల్వకు 17.05 టీయంసీల నీటి వాటాగా కేటాయించారు. దీంట్లో నుంచి మొదటి విడతలో 690 క్యుసెక్కుల చొప్పున 10 రోజుల పాటు నీరు విడుదల చేయనున్నారు. -
టీబి డ్యాం నీటి కోసం ఎదురుచూస్తున్న పల్లెవాసులు
– ఆదోనిలో తీవ్రమైన తాగు నీటి ఇబ్బందులు – పక్షం రోజుల్లోనే 37 టీయంసీలు చేరిక కర్నూలు సిటీ: జిల్లాలో నెలన్నర రోజులుగా అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. కానీ కుంటలు, చెరువుల్లో నీటి నిల్వలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదు. దీంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంత పల్లెల్లో తాగు నీటి ఇబ్బందులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నీటి పథకాల ట్యాంకుల్లోని నీటి నిల్వలు అడుగంటిపోయాయి. పశ్చిమ పల్లె వాసుల దాహాం తీర్చే ప్రధాన జలసిరి ఎల్ఎల్సీ కాల్వ. తుంగభద్ర జలాశయంలో నీరు లేకపోవడంతో దాదాపు మూడు నెలల నుంచి కాల్వలకు నీటి విడుదల ఆగిపోయింది. ఈ కాల్వ నీటిపై 17 రక్షిత తాగు నీటి పథకాలు 165 గ్రామాల ప్రజల తాగు నీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. అధికారులేమె వర్షాలు వచ్చాయి..తాగు నీటి ఇబ్బందులు లేవని అంటున్నారు. తాగు నీటి అవసరాలను దష్టిలో పెట్టుకొని ఎల్ఎల్సీకి టీబి డ్యాం నుంచి నీరు విడుదల చేయాలని జల వనరుల శాఖ ఇంజనీర్లకు వినతులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయం తుంగభద్ర డ్యాం. పక్షం రోజులుగా కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల సుమారు 37 టీయంసీల నీరు డ్యాంలోకి చేరడం గమనర్హం. భారీగా వరద నీరు చేరుతుండడంతో జిల్లా దిగువ కాల్వ(ఎల్ఎల్సీ) ఆయకట్టుదారుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. దీంతో మొదటగా తాగు నీటి అవసరాల కోసం కాల్వకు నీరు ఇవ్వాలని జల వనరుల శాఖ ఇంజనీర్లు బోర్డును కోరనున్నారు. ఇండెంట్లో పెట్టేందుకు ఇటీవలే జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్ సీహెచ్.విజయమోహన్‌కు నోట్ పెట్టారు. ఇండెంట్ పెట్టేందుకు అనుమతులు ఇస్తే రెండు, మూడు రోజుల్లో ఇండెంట్ పెట్టే అవకాశం ఉంది. తుంగా జలాల కోసం ఆశగా.. కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోని శివమొగ్గ, ఆగుంటె, చిక్కమగళూరు, మొరాళ, తీర్థహళ్ళి, మందగడ్డె ప్రాంతాల్లో 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల డ్యాంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పక్షం రోజుల్లోనే డ్యాంలోకి సుమారు 37 టీ.యం.సీల నీరు వచ్చి చేరినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో సుమారు 40 టీయంసీకు చేరింది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ప్రధానంగా ఆదోని మున్సిపాలిటిలో తీవ్రమై తాగు నీటి ఇబ్బందులు ఉన్నాయని వినతులు రావడంతో జల వనరుల శాఖ ఇంజనీర్లు ప్రస్తుత పరిస్థితిపై కలెక్టర్‌కు నోట్ పెట్టారు. డ్యాం నుంచి నీరు విడుదల చేయాలంటే కర్ణాటక ఇండెంట్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ పెట్టాలి. కర్ణాటక ప్రస్తుతం కూడ బళ్ళారి ప్రాంతాల్లో నెలకొన్న తాగు నీటి అవసరాలు తీర్చేందుకు ఈ నెల 21వ తేదినే ఇండెంట్ పెట్టనున్నటు తెలిసింది. గతేడాది కూడ ఇదే సమయంలోనే ఇండెంట్ పెట్టారు. గతేడాది జూలై 25 నాటీకి ఎల్ఎల్సీ కాల్వ ఏపీ సరిహద్దుకు నీరు చేరినట్లు అ«ధికార వర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్‌కు నోట్ పెట్టాం టీబి డ్యాంకు భారీగానే వరద నీరు వస్తుంది. జిల్లాలోని పశ్చిమ పల్లెల్లో తాగు నీరు ఇబ్బందులు ఉన్నాయని వినతులు వస్తున్నాయి. ఇటీవలే ఆదోని మున్సిపాలిటీ వారు ఎల్ఎల్సీ కాల్వకు నీరు విడుదల అయ్యేలా చూడాలని విన్నివించారు. ఈ విషయం కలెక్టర్‌కు నోట్ పెట్టాం. తాగు నీటికి ఇండేంట్ పెట్టుకునేందుకు కలెక్టర్ ఓకే చెబితే కర్ణాటక వారితో కలిసి ఇండేంట్ పెడతాం. – యస్.చంద్రశేఖర్ రావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ -
మంచినీటిపై రాజకీయాలు దురదృష్టకరం
ఎమ్మెల్యే హంపనగౌడ ఆవేదన సింధనూరు టౌన్ : నగరంతో పాటు తాలూకా వ్యాప్తంగా మంచినీటి సమస్యపై విపక్ష నేతలకు అవగాహన ఉన్నా నీటి విషయంలో రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్యే హంపనగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సింధనూరు నగరసభ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సింధనూరులో నీటి సమస్య పరిష్కారానికి తాను, నగరసభ యంత్రాంగం శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ విషయం విపక్ష నేతలకు తెలుసన్నారు. వారి వ్యాఖ్యలను గమనించానన్నారు. అనుభవజ్ఞులైన నాయకులు చేయాల్సిన వ్యాఖ్యలు కావన్నారు. ఇంకా నాలుగు నెలల పాటు నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని, అందువల్ల ముందు చూపుతో వ్యవహరిస్తున్నామన్నారు. టీబీ డ్యాంలో మంచినీటి అవసరాల కోసం ఇంకా సుమారు 3 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. బహుశ ఒకసారి కాలువకు నీరు వదిలించుకునేందుకు వీలవుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరోసారి కాలువకు నీరు వదిలేందుకు వీలు కాదన్నారు. ఈనెల 25న సింధనూరు వాసుల దాహార్తి తీర్చేందుకే తుంగభద్ర ఎడమ కాలువకు నీరు వదులుతున్నారన్నారు. సింధనూరులోని మంచినీటి చెరువులను, గ్రామీణ ప్రాం తంలోని చెరువులను నింపుకోవాలన్నా రు. ఈసందర్భంగా నగరసభ అధ్యక్షురాలు మంజుల పాటిల్, ఉపాధ్యక్షురాలు అన్వర్ బేగం, స్థాయీ సమితి అధ్యక్షుడు శరణయ్య స్వామి వక్రాణి, సభ్యులు ప్రభురాజ్, నబీసాబ్, మహ్మద్ అలీ, షఫియుద్దీన్ నవాబ్, వెంకటేష్ బండి, సురేష్ సేఠ్, శశికుమార్, నగర యోజన ప్రాధికారం అధ్యక్షుడు ఎస్.శరణేగౌడ, ఆర్సీ పాటిల్, మల్లికార్జున గుంజళ్లి, నన్నుసాబ్ పాల్గొన్నారు.