టీబీ డ్యామ్‌కు 165 టీఎంసీల నీరు రావొచ్చు
Published Thu, Jun 15 2017 12:53 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM
– ఎల్లెల్సీకి 18.796, కేసీకి 7 టీఎంసీలు వచ్చే అవకాశం
- బోర్డు అధికారుల అంచనా
కర్నూలు (సిటీ):వాతావరణ శాఖ సూచనల ప్రకారం వర్షపాతం 95శాతం నమోదైతే తుంగభద్ర జలాశయానికి ఈ ఏడాది 165 టీఎంసీల నీళ్లు వచ్చే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు అంచనా వేశారు. బుధవారం హోస్పేట్‌లో టీబీ డ్యామ్ అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డ్యామ్ ఎస్‌ఈ శశిభూషణ్‌రావు, కర్నూలు ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు, తుంగభద్ర ఎగువ కాల్వ, జహిరాబాద్ ఇంజనీర్లు పాల్గొన్నారు. తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్లెల్సీ)కు 18.7 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 7.7 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. గత ఏడాది 152 టీఎంసీల నీరు వస్తుందనుకోగా ఆస్థాయిలో నీరు రాలేదు. ఎల్లెల్సీ కాల్వ పరిధిలో రూ.8 కోట్లతో 49 టెలిమెట్రీ మీటర్ల ఏర్పాటుకు బోర్డు అధికారులు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఎల్లెల్సీ కాల్వ ఎక్కడైనా లీకేజీ అయితే వెంటనే వాటి మరమ్మతులు చేయనున్నారు.
Advertisement