
టీబీ డ్యాంలో పెరుగుతున్న నీటిమట్టం
బొమ్మనహాళ్ : టీబీ డ్యాంలో నీటిమట్టం పెరిగినట్లు జలాశయం సిబ్బంది గురువారం తెలిపారు. జలాశయం పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నీటిమట్టం ఆశాజనకంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిసే ఇన్‌ప్లో 15వేలు దాటిందని.. ఇదేవిధంగా మరో 20 రోజులు నీరు వచ్చి చేరితే ఆయకట్టుకు ఊపిరి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.