నెలాఖరు వరకు ఎల్లెల్సీకి నీరు | llc water supply ends last of this month | Sakshi
Sakshi News home page

నెలాఖరు వరకు ఎల్లెల్సీకి నీరు

Published Mon, Nov 21 2016 11:17 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

llc water supply ends last of this month

హొళగుంద: తుంగభద్ర దిగువ కాల్వ(ఎల్లెల్సీ)కు ఈ నెలాఖరు వరకు సాగునీటి సరఫరా ఉంటుందని టీబీ బోర్డు ఈఈ విశ్వనాథరెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. నీటి విడుదలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్షాభావం కారణంగా ఈ ఏడాది డ్యాంలో 60 టీఎంసీల నీరు మాత్రమే చేరిందని చెప్పిన ఆయన ఈ నెల 27 వరకు ఆంధ్ర కోటా కింద నీరు ఇవ్వాల్సి ఉందన్నారు. అందులో భాగంగా కాల్వ కింద సాగైన పంటలు, ఆంధ్రాకు తాగునీరును అందించాలనే ఉద్దేశంతో  బోర్డు ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కర్ణాటక కోటా నీటిని నిలిపి వేసి ఆంధ్రాకు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు ఈఈ వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement