టీబీ బోర్డు కేసును వాయిదా వేసిన హైకోర్టు
Published Sat, Dec 3 2016 12:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
కర్నూలు సిటీ: టీబీ బోర్డు కేసును శుక్రవారం హైకోర్టు వాయిదా వేసింది. తుంగభద్ర జలాల విషయంలో దిగువ కాలువ ఆయకట్టుకు అన్యాయం జరుగుతోందని రైతులు హైకోర్టులో కేసు వేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరుగగా.. టీబీ డ్యాంలో కేవలం 5.5 టీఎంసీల నీరు మాత్రమే ఉందని బోర్డు తరఫున కోర్టుకు నివేదించారు. నిల్వ నీటిపై కర్ణాటక ప్రభుత్వ తప్పుడు లెక్కలు చెబుతుందని, 9.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని బోర్డు అధికారులే సమాచారం ఇచ్చారని పీపీ కోర్టు దృష్టికి తీసుకపోయారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విచారణను ఈ నెల6వ తేదికి వాయిదా వేసింది.
Advertisement
Advertisement