సాక్షి, హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీకి కార్యాలయ నిర్మాణం నిమిత్తం గుంటూరు జిల్లా, మంగళగిరిలో ఇచ్చిన భూమి తమదని, తమకు ఎటువంటి పరిహారం ఇవ్వకుండానే భూమిని తీసుకున్నారంటూ బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పరిహారం ఇవ్వకుండా భూమి తీసుకోవడంపై విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్ తహసీల్దార్‌లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న ఆర్‌డీవో సంగా విజయలక్ష్మికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
టీడీపీ కార్యాలయం కోసం ఇచ్చిన భూమి మాది
Published Sat, Dec 30 2017 2:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment