అనంతపురం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు
అనంతపురం శ్రీకంఠం సర్కిల్/సోమందేపల్లి: గంజాయి అమ్మేవారిపై దాడులా అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించడానికి సర్కారు ఓ వైపు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ దానిని నిర్వీర్యం చేస్తున్న సమయంలో టీడీపీ అధినేత ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
చదవండి: డిజిటల్ హెల్త్‌లో ఏపీ టాప్
ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశంతోపాటు రాప్తాడు రోడ్‌షో, శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో జరిగిన బహిరంగ సభలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో గంజాయికి ఎక్కువమంది బానిసలవుతున్నారని.. గుంటూరులో యువకులు గంజాయి మత్తులోనే విద్యార్థినిపై అత్యాచారానికి తెగబడ్డారని.. దాని నుంచి మీ పిల్లలను కాపాడుకోవాలంటూ చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కార్యకర్తలు తలలు పట్టుకున్నారు. తమ అధినేత ఇలా మాట్లాడడంతో వారంతా అవాక్కయ్యారు.
40 శాతం సీట్లు యువతకే
ఇక పార్టీని ఈసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నానని.. ప్రధానంగా 40 శాతం సీట్లు యువతకు కేటాయిస్తానని.. కొత్తగా వచ్చేవారికి అవకాశమిస్తానన్నారు. తన వయసు 72 ఏళ్లయినా మీకోసం 27 ఏళ్ల కుర్రాడిలా పనిచేస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా సోమందేపల్లిలో టీడీపీ అభిమానులు కేక్‌కట్ చేసి.. ఆయన చిత్రపటాలతో హంగామా చేశారు. ‘జై జూనియర్ ఎన్టీఆర్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న కొంతమంది టీడీపీ నాయకులు వారిపై అసహనం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment