
సాక్షి, హైదరాబాద్: ధూల్‌పేటలో గంజాయి అడ్డాలపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి నంద్యాల అంజిరెడ్డి సారథ్యంలో గత 15 రోజుల్లో 20 మందిని అరెస్టు చేసి దాదాపు నాలుగు క్వింటాళ్ల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు.
విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం నుంచి ఎండిన గంజాయి పలకాలను స్మగ్లింగ్ చేస్తున్న అచ్యుతరావు అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 22.5 కిలోల గంజాయి పలకాలను, అదేప్రాంతానికి చెందిన బుజ్జిబాబు నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారినుంచి గంజాయి తీసుకున్న కిషోర్‌సింగ్, పవన్‌సింగ్, అరుణాభాయ్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. మరో కేసులో వంశీకృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేసి గంజాయి, నగదుతోపాటు యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment