విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నసీఐ శరత్‌రాజ్ కుమార్ పక్కన ఐపీఎస్ అధికారి రిషాంత్‌రెడ్డి
సాక్షి,దేవరపల్లి : విశాఖ జిల్లా పాడేరు నుంచి తమిళనాడుకు రెండు కార్లలో అక్రమంగా రవాణా అవుతున్న 228 కిలోల గంజాయిని సోమవారం ఉదయం దేవరపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని, రెండు కార్లను స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కొవ్వూరు రూరల్ సీఐ సి. శరత్‌రాజ్‌కుమార్ ట్రైనీ ఎస్పీ వై.రిషాంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గంజాయి అక్రమ రవాణా గురించి వివరించారు. తమిళనాడులోని దిండిగల్ జిల్లా బట్లగుండు గ్రామానికి చెందిన ఆనందన్‌శివసామి, చల్లపాండి, సంగీతకుమార్, రంజిత్‌లు బొలొరా, షిప్టు కార్లులో విశాఖ జిల్లా పాడేరు నుంచి తమిళనాడులోని బట్లగుండు గ్రామానికి 214 గంజాయి ప్యాకెట్లును రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment