
ఇంటి ఆవరణలో పెంచుతున్న గంజాయి మొక్కలను పరిశీలిస్తున్న సీఐ తిరపతయ్య, సిబ్బంది
ప్రకాశం, బల్లికురవ: ఇంటి అవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం మేరకు మంగళవారం అద్దంకి ఎస్‌ఐ, సీఐ తిరపతయ్య మండలంలోని గుంటుపల్లి గ్రామంలో తనిఖీ నిర్వహించారు. సీఐ అందించిన వివరాల ప్రకారం గుంటుపల్లి గ్రామంలో అద్దేటి ఏడుకొండలు ఇంటి ఆవరణలో కూరగాయలు ఆకుకూరల మొక్కల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. తనిఖీల్లో భాగంగా 3 గంజాయి మొక్కలను గుర్తించి ఏడుకొండలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి బుధవారం అద్దంకి కోర్టుకు హజరుపరుస్తామని చెప్పారు. గంజాయి మొక్కలు పెంచటం, అమ్మటం చట్టరీత్యా నేరమని ఎంతటివారపైన అయినా కేసు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.