ముంబై : కేకుల్లో ఇడిబుల్(తినడానికి వీలుగా ఉండే) గంజాయి పెట్టి అమ్మకాలు సాగిస్తున్న ఓ యువ జంటను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం ముంబై, మలద్‌లోని ఓ బేకరీపై రైడ్ చేసిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి గంజాయి సప్లయ్ చేస్తున్న మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ జంట లాక్‌డౌన్ సమయంలో బేకరీ వ్యాపారం ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా కేకుల అమ్మకాలు సాగిస్తోంది. ఈ జంట వెబ్ సిరీస్ స్ఫూర్తితో గంజాయి కేకులు తయారు చేయటం మొదలుపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆర్డర్లు తీసుకుని గంజాయి కేకులు అమ్మేవారు. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా డబ్బులు వసూలు చేసేది.
అధికారులు ఈ జంట వద్దనుంచి 830 గ్రాముల ఇడిబుల్ గంజాయిని, 160 గ్రాముల మామూలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఇడిబుల్ గంజాయి సప్లయ్ చేస్తున్నవారి కోసం అధికారులు అన్వేషణ మొదలుపెట్టారు. నిందితుల ఇంటినుంచి కస్టమర్ల పేర్లు ఉన్న ఓ డైరీని సైతం స్వాధీనపర్చుకున్నారు. గంజాయి కేకులు కొద్దిగా ఆకుపచ్చరంగులో ఉండి.. కొద్దిగా గంజాయి వాసన కూడా వస్తుందని.. మామూలు కేకులకు, గంజాయి కేకులకు తేడా కనుక్కోవటం అంత వీజీ కాదని అధికారులు చెబుతున్నారు.
చదవండి : హైదరాబాద్‌లో: కార్లను అద్దెకు తీసుకుని ఆపై అమ్మకం..
Comments
Please login to add a commentAdd a comment