
గంజాయి తరలించిన కారు
మల్కాపురం(విశాఖ పశ్చిమ): పారిశ్రామిక ప్రాతంలో గం జాయి తరలిస్తున్న వారిని మల్కాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లు ద్వారా తీసుకువచ్చిన గంజాయిని ఓ ఇంటి వద్ద డంప్ చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. పంచదార్ల రమణ అనే వ్యక్తి 47వ వార్డు ఎక్స్‌సర్వీస్‌మెన్‌కాలనీలో ఓ ఇంట్లో మూడు నెలల క్రి తం అద్దెకు దిగాడు. ఇతను జీకేవీధికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఇక్కడే జీవిస్తున్నాడు. రమణ అత్తమామలకు చింతపల్లిలో వ్యవసాయ భూమి ఉంది.
ఆ సమీపాన పండిస్తున్న గంజాయిని రమణ తక్కువ ధరకు కొనుగోలు చేసి, గతంలో పరిచయం ఉన్న తమిళనాడు, మధురై ప్రాంతాలకు చెందిని ఐదుగురు (నగరంలో ఈ ఐదుగురు నివాసముంటున్నారు) సాయంతో కేజీ రూ.12వేలు చొప్పున విక్రయిస్తుం టాడని, ఈ మేరకు గురువారం అర్ధరాత్రి రెండు కార్లలో చింతపల్లి నుంచి తీసుకువచ్చిన 120 కిలోల గంజాయిని డంప్ చేశారు... అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. రంగంలోకి దిగిన ఎస్‌బీ పోలీసులు, మల్కాపురం పోలీ సుల సాయంతో అర్ధరాత్రి రమణ ఇంటిపై దాడి చెయ్యగా గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలించిన రమణతో పాటు ఐదుగురు తమిళనాడు ప్రాంత వాసులను అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై పోలీసులు స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment