న్యూఢిల్లీ : డ్రగ్ మాఫియా రెచ్చిపోతోంది. మత్తుమందుల అక్రమ రవాణా, సరఫరా దేశం నలుచెరుగులా విస్తరించింది. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో మత్తు పదార్ధాలను దాచిన ఎయిర్‌లైన్ ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నయ్ నుంచి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో భోజన పదార్థాలను తీసుకువెళ్లే కార్ట్‌లో రెండు కిలోల మరిజోనా అనే మత్తు మందును అధికారులు సీజ్ చేశారు. నార్కోటిక్స్‌ను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఎయిర్‌లైన్ ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. జులై 19న జరిగిన ఈ ఉదంతంపై పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం క్యాబిన్ సిబ్బంది ఒకరిని అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.
విమానంలో వాటిని దాచాడు...
Published Sat, Aug 19 2017 7:10 PM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM
Advertisement
Advertisement