రంగాపూర్‌లో గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్న అధికారులు
మహబూబ్‌నగర్, అచ్చంపేట: నల్లమల అటవీప్రాంతం గంజాయి సాగుకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ సారవంతమైన భూములు ఉండటంతో అక్రమార్కులు అంతరపంటగా, మామిడి, ఇతర తోటల్లో గంజాయి సాగుచేస్తూ అక్రమ వ్యాపారానికి ద్వారాలు తెరిచారు. రూ.కోట్ల విలువైన గంజాయిని ఇక్కడినుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ విషయం గురించి పక్కా సమాచారం సేకరించిన ఎక్సైజ్‌శాఖ మంగళవారం అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామశివారులో కంది, పత్తి పంటల్లో అంతర్‌పంటగా 3ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన సుమారు 5,050 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. దాని విలువ సుమారుగా రూ.50లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అలాగే కేజీ ఎండిన గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. బొల్గాట్‌పల్లి శివారులోని సర్వేనంబరు 33/ఆ/2లో రంగాపూర్ గ్రామానికి చెందిన రామావత్ శ్రీను అలియాస్ చిన్న కుచెందిన పొలంలో గంజాయి సాగుచేసినట్లు సమాచారం అందిందని, పోలీసుశాఖ సహకారంతో దాడులు చేసి ఒకరిని అ రెస్ట్‌చేసినట్టు మహబూబ్‌నగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎక్సైజ్ సీఐ మహబూబ్‌అలీ తెలిపారు. దాడుల్లో సిబ్బంది గణపతిరెడ్డి, అచ్చంపేట సీఐ శ్రావణ్‌కుమార్, ఎస్‌ఐ నిజామొద్దీన్, దామోదర్, స్వామి, చిన్న, సూర్యానారాయణ, బాబు, లక్ష్మినర్సింహారెడ్డి, సంతోష్, అనిత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment