
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీసీ నాగలక్ష్మి, చిత్రంలో ఇతర సిబ్బంది
చిత్తూరు , శ్రీకాళహస్తి టౌన్ః ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 74 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు ఎక్సైజ్ డీసీ టి.నాగలక్ష్మి తెలిపారు. ఆదివారం శ్రీకాళహస్తిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఎక్సైజ్ సీఐ లీలారాణి ఆధ్వర్యంలో పోలీసులు తెల్లవా రు జామున వాహనాలు తనీఖీ చేస్తుండగా.. బసవయ్యపాళెం చెక్‌పోస్టు వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజా యి ఉన్నట్లు గుర్తించారు. 6 బస్తాలలో తరలి స్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారుగా రూ.2 లక్షల 22 వేలు ఉంటుందని తెలిపారు. గంజాయితో పాటు ఇద్దరు పురుషులు, నలుగులు మహిళలను అరె స్టు చేసినట్లు తెలిపారు.
వీరు చింతపూడి నుంచి బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్నట్లు గు ర్తించినట్లు పేర్కొన్నారు. అక్కడ కేజీ రూ.895 వంతున కొని బెంగుళూరులో 3 వేల కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అరెస్టు అయిన వారిలో మదనపల్లెకు చెందిన చంద్ర, రవి, సాలమ్మ, పద్మావతి, భాగ్య, గౌరమ్మ ఉన్నారు. వీరిలో చంద్రపై 2016లో గంజాయి కేసు నమోదై అరెస్టు చేసినట్లు వివరించారు. నింది తులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అధికారులు నాగముద్దయ్య, గోపాల్, శ్యాం సుందర్, నాగభూషణం, మురళీ మోహన్ పాల్గొన్నారు.