అక్రమంగా గంజాయి రవాణా చేసి పట్టుపడ్డ మహిళలు (ఫైల్)
కరీమాబాద్ : చేతిలో చంటిపిల్లలు.. భుజాలకు హ్యాండ్ బ్యాగులు..కుటుంబ సభ్యులందరూ పం డుగకు రైల్లో ఊరెళ్తున్నట్లుగా ఉంటారు.. కానీ వా రు గంజాయి రవాణా చేస్తున్నారని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఆయా వ్యాపారులు రైల్లో మహిళలు, మహిళా కూలీలను ఉపయోగిస్తున్నారు. ఇటీవల వరంగల్ రైల్వేస్టేషన్‌లో రెండు వేర్వేరు రైళ్లలో హర్యానా, ఒడిషాకు చెందిన రెండు ముఠాలు పో లీసులకు పట్టుబడటమే ఉదాహరణ.ఇందులో ఆ రుగురు మహిళలతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారివద్ద117కిలోల ఎం డు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా, విశాఖపట్టణం నుంచి రైళ్లలో చంటిపిల్లలున్న మ హిళలను, మహిళా కూలీలను ఒక్కొక్కరికి రూ. 5 వేల చెల్లిస్తూ గంజాయి రవాణాకు ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా కోనార్క్,ఈస్ట్‌కోస్ట్,ఏపీ,గౌతమి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో గంజాయి రవాణా సాగుతోంది.
ఏడాది కాలంలో..
గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని వరంగల్ జీఆర్పీ పోలీసులు దశలవారీగా పట్టుకున్నారు. ఇందులో మొత్తం 620 కిలోల గంజాయిని పట్టుకోగా 11 కేసులు కూడా నమోదయ్యాయి. ఇందులో 33 మందిని అరెస్ట్ చేసి ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.60లక్షలు ఉంటుంది. ఈ కేసుల్లో పురుషులతోపాటు మహిళలు ఉన్నారు.
అరెస్టయిన మహిళలు..
ఒడిషా, విశాఖపట్నం ప్రాంతాల్లోని గంజాయి డా న్‌లు మహిళల ద్వారా గంజాయిని ఢిల్లీ, మహా రాష్ట్ర ప్రాంతాలకు వందలాది కిలోలు రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా జనరల్ బోగీల్లో ప్రయానిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని పలు రైల్వేస్టేషన్లు దాటి వరంగల్‌కు వచ్చి ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లే రైళ్లలో ఎక్కే క్రమంలో పోలీసులకు దొరికిపోతున్నారు. ఇప్పటివరకు మహారాష్ట్రకు చెందిన రానీ రాజ్‌నా యుడు, ఆర్తి రవిదేవర్,రేవటీనాయక్,హర్యానాకు చెందిన గీతాబౌరీ,కమలా బగిడె,పూజా బౌరీ, గం గా బౌరీ, ఒరిస్సాకు చెందిన మీరాసేతీ, పూనమ్ ముత్యం, పంకజ్ నిషల్, నిస్తా లిమా, గౌరీ పెదనూయి, దీప్తి మిషల్ తదితరులు అరెస్టయ్యారు.
వారందరూ కూలీలే..
ఒడిశా, విశాఖపట్టణం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాలకు ఎండు గంజాయి రవాణా అవుతోంది. గంజాయి డాన్‌లు దళారులను ఏర్పాటు చేసుకుని రైళ్లలో పేద, మధ్యతరగతి కూలీ మహిళలను ఎంచుకుని వారితో సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రూ.500 కిలోల గంజాయి కొని, వాటిని ప్యాకెట్లుగా చేసి సంచుల్లో పెట్టి దళారుల ద్వారా ఒక్కో మహిళకు ట్రిప్‌కు రూ.5వేల చొప్పున ఇస్తుండడంతో వారు ఆశపడి రవాణా చేస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు.
కాగా పట్టుబడిన మహిళలు తాము ఎందుకు ఈ దందాలోకి ఎందుకు వచ్చామా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. పోలీసులు ప్రశ్నించిన సందర్భాల్లో వారు తమకు గంజాయి అప్పగించిన వ్యక్తుల గురించి తెలియజేయడంలేదు. అయినప్పటికీ ఇటీవల వైజాగ్‌కు చెందిన సహదేవ్ అనే గంజాయి వ్యాపారి గురించి మాత్రం తెలుసుకోగలిగారు.
గంజాయి రవాణా చేస్తే కేసులు
గంజాయి రవాణా చేస్తే ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నాం. రైళ్లలో తనిఖీలు చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం. ఎలాంటి అనుమానం వచ్చినా సోదా చేస్తున్నాం. ఇటీవల అక్రమ గంజాయి రవాణాలో కుటుంబ సభ్యుల్లా మహిళలు బ్యాగుల్లో గంజాయి తరలిస్తుండటం గమనించి పట్టుకున్నాం. గంజాయి తరలించి జైలు పాలు కావొద్దు.
– జూపల్లి వెంకటరత్నం, సీఐ వరంగల్ జీఆర్పీ
Comments
Please login to add a commentAdd a comment