
నిందితుడిని చూపుతున్న పోలీసులు
సంగారెడ్డి క్రైం: సంగారెడ్డి పట్టణంలోని శివాజీ నగర్‌లో ఓ ఇంటిలో దాచి ఉంచిన 4.4 కిలోల ఎండు గంజాయి పట్టుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో విశ్వసనీయమైన సమాచారం మేరకు సంగారెడ్డిలోని శివాజీనగర్‌కు చెందిన అమర్‌సింగ్ ఇంటిపై దాడి చేశామన్నారు. అతడి ఇంట్లో దాచి ఉంచిన 4.4 కిలోల ఎండు గంజాయి పట్టుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దాడిలో ఎస్‌ఐ భాస్కర్‌గౌడ్, హెడ్‌కానిస్టేబుల్ అలీమ్, జాకబ్, సర్దార్, రవి తదితరులు పాల్గొన్నారు.