గంజాయిని అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు సరికొత్త ప్రయోగం చేసి మరోసారి పోలీసులకు పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి, గిరిజన ప్రాంతాల మీదుగా అరుకు, అనంతగిరి, బొడ్డవర, గంట్యాడ మీదుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు గంజాయి అక్రమ రవాణా దందా కొన్నాళ్లుగా కొనసాగుతుంది.