
ప్రతీకాత్మక చిత్రం
పాట్నా : గంజాయి కొనడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో స్నేహితుడ్ని హత్య చేశాడో వ్యక్తి. ఈ సంఘటన బిహార్‌లోని పాట్నా జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాట్నా జిల్లా పాలి గ్రామానికి చెందిన ప్రదీప్ కుమార్, ప్రిన్స్ కుమార్ స్నేహితులు. ప్రిన్స్ కుమార్ గంజాయికి బానిస. ప్రతి రోజు గంజాయి తీసుకునేవాడు. ఈ నేపథ్యంలో శనివారం తనకు గంజాయి కొనడానికి 50 రూపాయలు ఇవ్వాలని ప్రదీప్‌ను అడిగాడు. అయితే, ప్రదీప్ డబ్బులు ఇవ్వనని చెప్పాడు. దీంతో ఇద్దరికీ మాటా,మాటా పెరిగి గొడవ జరిగింది.
ప్రిన్స్ తన దగ్గర ఉన్న కత్తితో ప్రదీప్ రొమ్ముపై నాలుగైదు సార్లు పొడిచి, అక్కడినుంచి పారిపోయాడు. తీవ్రగాయాలపాలైన ప్రదీప్‌ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికి లాభం లేకపోయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment