ఏలూరులో గంజాయి కేసులో అరెస్టు చేసిన విద్యార్థులు, విక్రయదారులతో ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు, త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావు
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : ఏలూరులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు, 10 మంది విద్యార్థులను ఏలూరు త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వట్లూరు పంచాయతీ రా మచంద్ర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని తోటల్లో రెండు గ్రూపులుగా విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరంకి నాగేశ్వరరావు నుంచి ఐ దున్నర కిలోలు, మత్తి ప్రవీణ్‌కుమార్ అలియాస్ చింటూ నుంచి నాలుగున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు. ఈమేరకు ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు, త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు బు ధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఏలూరు త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావుకు వచ్చిన సమాచారంతో రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని తోటల్లో గంజాయి సేవిస్తున్న ఇంజి నీరింగ్, డిగ్రీ కళాశాలలకు చెందిన 10 మంది విద్యార్థులతోపాటు ఇద్దరు విక్రయదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు రోజూ గంజాయి ఎంత ఎ క్కువ తాగితే అంత స్కోరింగ్ సాధించినట్టుగా భావిస్తూ పోటీలు పెట్టుకోవటం ఆందోళన కలిగించే అంశంగా డీఎస్పీ చెప్పారు. విద్యార్థులు విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు పిల్లల నడవడికపై ఆరా తీయాలన్నారు. విశాఖ జిల్లా నుంచి గంజాయిని ఏలూరుకు తరలిస్తూ విద్యార్థులే టార్గెట్‌గా విక్రయాలు చేస్తున్నారని చెప్పారు. డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులను గంజాయికి బానిసలుగా మార్చుతూ కొందరు వ్యాపారం చేస్తున్నారన్నారు.
పెదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన పాత నేరస్తుడు వీరంకి నాగేశ్వరరావు, మధ్యలోనే కళాశాల విద్యను ఆపేసిన హనుమాన్ జంక్షన్‌కు చెందిన మత్తి ప్రవీణ్‌కుమార్ అలియాస్ చింటు విశాఖ, అరకు ప్రాంతాల నుంచి గంజాయిని తీ సుకువచ్చి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకూ ఖరీదుకు విక్రయిస్తున్నారన్నారు. వీరితోపాటు విద్యార్థులు పెదవేగికి చెం దిన మాగంటి హర్షవర్దన్ (ఇంజినీరింగ్), ఏలూరుకు చెందిన రాయుడి దిలీప్ చక్రవర్తి (ఇంజినీరింగ్), కొమడవోలుకు చెం దిన పామర్తి సాయికుమార్ (డిగ్రీ), ఏ లూరుకు చెందిన దేశిన విజయకుమార్ (ఇంజినీరింగ్), మల్లంపల్లి చైతన్య (ఇం జినీరింగ్), పెదవేగికి చెందిన వీరమల్లు వర్మ (ఇంజినీరింగ్), ఏలూరుకు చెందిన పఠాన్ మొహిద్దీన్ (ఇంజినీరింగ్ ), లొట్టి దేవి ప్రశాంత్ (ఇంజినీరింగ్), పెదపాడుకు చెందిన శిక్కా సుధీర్‌కుమార్ (ఇం జినీరింగ్), ఏలూరుకు చెందిన తోట సా యిసాగర్ (ఇంజినీరింగ్) అనే విద్యార్థులను అరెస్టు చేశామని డీఎస్పీ చెప్పారు.
స్కోరింగ్ పోటీలు
నగరంలోని ఆయా ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారా రు. అమ్మపాలెం, ఏలూరులోని పలు ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగో లు చేస్తున్నారు. తమ స్నేహితులతో క లిసి రోజూ స్కోరింగ్ గేమ్ ఆడుతున్నా రు. రోజుకు ఎంత ఎక్కువ గంజాయి సేవిస్తే అంత స్కోరింగ్ చేసినట్టు గొప్పగా చెప్పుకుంటున్నారు. గతంలో రూ. 50, రూ.100కు గంజాయి విక్రయించగా డిమాండ్ పెరిగిపోవటంతో అమ్మకం దారులు ధర పెంచేశారు. ప్రస్తుతం రూ. 500 నుంచి గంజాయిని పొట్లాలుగా చేసి విక్రయిస్తున్నారు. పెద్ద గంజాయి ఆకును రూ.500కు విక్రయిస్తున్నట్టు పోలీస్ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment