ఉల్లి లోడు పేరుతో భారీ గంజాయి స్మగ్లింగ్‌‌ | Police Seized 1110 KG Marijuana In Orissa | Sakshi
Sakshi News home page

ఉల్లి లోడు పేరుతో భారీ గంజాయి స్మగ్లింగ్‌‌

May 20 2020 8:18 AM | Updated on May 20 2020 8:22 AM

Police Seized 1110 KG Marijuana In Orissa - Sakshi

పోలీసులు పట్టుకున్న గంజాయి లారీ,

బరంపురం : ఉల్లిపాయల లోడు పేరుతో అక్రమంగా 1100 కేజీల గంజాయి రవాణా చేస్తున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఘటనలో ట్రక్కుని సీజ్‌ చేసి, డ్రైవర్‌తో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు పోలీసులు. ఐఐసీ అధికారి అందించిన సమాచారం ప్రకారం... బరంపురం జిల్లా కె.నువగాం పోలీసు స్టేషన్‌ పరిధిలో తుంబా అటవీమార్గం గుండా ఉల్లిపాయల లోడ్‌ పేరు చెప్పి, అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది. గంజాం ఎస్పీ ఆదేశాల మేరకు కె.నువాగం పోలీసులు అటవీ మార్గంలో నిఘా పెట్టారు. ( ప్రాణం తీసిన వివాహేతర సంబంధం )

అటువైపుగా వస్తున్న ట్రక్కుపై దాడి చేసి, తనిఖీ చేయగా.. భారీగా గంజాయి నిల్వలు కనిపించాయి. ఇందులో 1100 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ట్రక్కు సహా సీజ్‌ చేసి, డ్రైవర్, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారి వద్ద నుంచి ఒక తుపాకీ, 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement