బస్సులో 120 తాచు పాములు | Police stop bus carrying 120 live cobras in central Vietnam | Sakshi
Sakshi News home page

బస్సులో 120 తాచు పాములు

Published Fri, Nov 25 2016 4:36 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

బస్సులో 120 తాచు పాములు

బస్సులో 120 తాచు పాములు

హనోయ్: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 120 తాచుపాములు..అన్ని బతికున్నవే. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి గుట్టు చప్పుడుకాకుండా దొంగ రవాణా చేస్తున్నారు. పెద్ద బస్సులో నలుగురే వ్యక్తులు ఓ డ్రైవర్ మాత్రమే వెళుతుంటే అనుమానం వచ్చిన పోలీసులు బస్సును ఆపి చూడగా ఈ విషయం బయటపడింది. దీంతో వారందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వియత్నాం రాజధాని హనోయ్లో చోటు చేసుకుంది.

విన్ పుక్ ప్రావిన్స్ నుంచి  హో కి మిన్ నగరానికి విడివిడిగా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి వీటిని తరలిస్తున్నారని, వీటి మొత్తం బరువు 220 కేజీలు ఉంటుందని పోలీసులు వివరించారు. ఇలాంటి చర్యలు తమ దేశంలో తీవ్రమైన నేరంగా వస్తుందని చెప్పారు. ప్రజలకు ప్రమాదకరమైన వస్తువులను, జీవరాశులను తరలించడం నేరంకిందకు వస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement