బ్లాక్‌మార్కెట్‌లో రేషన్ బియ్యాన్ని అమ్ముతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
రాయదుర్గం (అనంతపురం) : బ్లాక్‌మార్కెట్‌లో రేషన్ బియ్యాన్ని అమ్ముతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి 30 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం గోవిందవాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర శెట్టి అనే వ్యాపారి రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముతుండటంతో.. విజిలెన్స్ అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.