
సాక్షి, విజయవాడ: గుజరాత్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌కు విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విజయవాడకు డగ్స్ తరలిస్తుండగా పట్టుకున్నారన్నది వాస్తవం కాదని సీపీ స్పష్టం చేశారు. గుజరాత్ ముంద్ర పోర్టులో హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. (చదవండి: ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!)
చెన్నై నివాసముంటున్న దుర్గాపూర్ణ వైశాలి పేరుతో విజయవాడ అడ్రస్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారన్నారు. కొన్నేళ్లుగా వైశాలి, ఆమె భర్త, సుధాకర్ చెన్నైలో ఉంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ డీఆర్‌ఐ విచారణ జరుపుతోందని సీపీ వివరించారు. ఈ కేసుపై అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నైలలో కూడా సోదాలు నిర్వహించాయన్నారు. విజయవాడలో ఇంటి అడ్రస్‌తో లైసెన్స్ తీసుకోవడం తప్పితే డ్రగ్స్ ఆనవాళ్లు లేవని సీపీ తెలిపారు.
చదవండి:
గర్ల్‌ఫ్రెండ్‌కు 11 రూల్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు
Comments
Please login to add a commentAdd a comment