50 కేజీల గంజాయి స్వాధీనం
Published Fri, Dec 23 2016 1:26 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని మణుగూరులో పోలీసులు జరిపిన తనిఖీల్లో 50కేజీల గంజాయి పట్టుబడింది. పట్టణ ప్రధాన రహదారిపై తనిఖీలు చేపట్టిన పోలీసులు స్కార్పియోలో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో ఓ కత్తి, ఇనుపరాడ్‌తో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మణగూరు సీఐ మొగిలి తెలిపారు. గంజాయి ప్యాకెట్లను స్థానిక ఎమ్మార్వో తిరుమలాచారి పరిశీలించారు. కేసు నమోదు చేసి మరింత సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement