భారీ బంగారం, విదేశీ నగదు సీజ్
Published Sat, Feb 25 2017 7:46 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM
ముంబై: ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారం విదేశీ కరెన్సీ పట్టుబడింది. అధికారుల సాధారణ తనిఖీల్లో భాగంగా 5 కేజీల బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు శనివారం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తిని నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసకున్నారు. దీంతో పాటు విదేశీ కరెన్సీ ని కూడా సీజ్ చేశారు.
ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ... ఓ ప్రయాణికుడి నుంచి ఐదు కేజీల బంగారం, భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 1.77 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తుకొనసాగుతుందని వెల్లడించారు.
Advertisement
Advertisement