ప్రసిద్ధ ముంబై లాల్‌బాగ్చా గణేశుడికి ఈ ఏడాది ఉత్సవాల్లో భక్తుల నుండి కానుకల రూపంలో భారీగా ఆదాయం వచ్చింది. పది రోజులలో రూ.5.65 కోట్ల నగదు, 4.15 కిలోల బంగారం, 64.32 కిలోల వెండి వస్తువులను భక్తులు సమర్పించారు.
గణేశ్ చతుర్థి ఉత్సవాలు ముగియడంతో గణపతి బప్పాకు వీడ్కోలు పలుకుతూ లాల్‌బాగ్చా రాజాకు పది రోజులలో వచ్చిన కానుకలను వేలం వేశారు. లాల్‌బాగ్చా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్ వారు ప్రతి సంవత్సరం భక్తుల నుంచి వచ్చిన బంగారం, వెండిని బహిరంగ వేలం ద్వారా భక్తులకే అందిస్తారు. భక్తులు వీటిని ఆ లంబోదరుడి ప్రసాదంగా భావించి వేలంపాటలో దక్కించుకుంటారు.
ఈ ఏడాది లాల్‌బాగ్చా రాజాకు రూ. 5,65,90,000 నగదుతో పాటు 4,151 గ్రాముల బంగారం, 64,321 గ్రాముల వెండి భక్తుల నుంచి వచ్చాయి. ఆనవాయితీ ప్రకారం గణేశోత్సవ్ మండల్ వారు అన్ని వస్తువులను వేలం వేశారు. లాల్‌బాగ్చా రాజాకు వచ్చిన అన్ని ఆభరణాలలో 990.600 గ్రాముల బంగారు గొలుసును వేలం వేయగా రూ. 69.31 లక్షలు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment