కిరాణా షాపుల్లో అక్రమంగా విక్రయిస్తున్న 120 లీటర్ల కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : కిరాణా షాపుల్లో అక్రమంగా విక్రయిస్తున్న 120 లీటర్ల కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ డీలర్‌తో లోపాయకారి ఒప్పందం ప్రకారం ఎక్కువ రేటుకు కిరోసిన్ విక్రయిస్తున్న షాపు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నెరేడ్‌మెట్ జె.జె.నగర్‌లో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా కిరాణ షాపు నిర్వహిస్తున్న దశరథ్ అనే వ్యక్తితో పాటు రేషన్ డీలర్‌ను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.