నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం
మాల్దా: నకిలీ కరెన్సీ సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు రూ. 3.80 లక్షల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో చోటుచేసుకుంది. కలియచక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీకి సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఈ నకిలీ కరెన్సీని సీజ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నోట్లు వారి వద్దకు ఎలా వచ్చాయన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇటీవల అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్న దొంగనోట్లు చలామని చేసే ముఠా మూలాలు పశ్చిమ బెంగాల్ లో ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే.