![హీరోయిన్ బ్యాంక్ అకౌంట్లు సీజ్](/styles/webp/s3/article_images/2017/09/4/51415863619_625x300.jpg.webp?itok=r1yBjzFN)
హీరోయిన్ బ్యాంక్ అకౌంట్లు సీజ్
అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్తో సంబందాలున్నాయన్న ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ మాజీ హీరోయిన్ మమతా కులకర్ణికి మరో షాక్ తగిలింది. ఈ బ్యూటి ఆర్థిక లావాదేవిల మీద దృష్టి పెట్టిన పోలీసు అధికారులు మమతా కులకర్ణికి సంబందించిన అన్ని బ్యాంక్ అకౌంట్స్ను సీజ్ చేశారు. ఇప్పటికే ఎనిమిది బ్యాంక్ అకౌంట్ లను సీజ్ చేసినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు.
ఒక్క మలాద్ బ్యాంక్ ఎకౌంట్ లోనే 67 లక్షల రూపాయల నగదు ఉండగా.. ఇతర అకౌంట్లన్నింటిలో కలిపి మరో 26 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ఖాతాల నుంచి ఎలాంటి లావాదేవిలు జరపలేదని తెలిపారు. త్వరలో ఇండియాలో ఉన్న మమత ఆస్తులను కూడా సీజ్ చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతోంది.