35 ద్విచక్రవాహనాలు, 9 ఆటోలు స్వాధీనం
ఖమ్మం: ఖమ్మం రమణగుట్టలో తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన గుర్తింపు పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు స్వాదీనం చేసుకున్నారు. వీటిలో ఒకే నెంబర్ గల రెండు ఆటోలను గుర్తించారు. పదిమంది పాత నేరస్తులు, మరో పదిమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ నుంచి దొంగిలించిన ఒక ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. వికలాంగుల కాలనీ, హనుమాన్‌నగర్, సవరాల కాలనీ, వివేకానంద కాలనీ, జగ్జీవన్‌రామ్ కాలనీల్లో సోదాలు చేశారు. ఏసీపీ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో సీఐలు రెహ్మాన్, రాజిరెడ్డి, వెంకన్నబాబు, నాగేంద్రచారి, ఆంజనేయులు పాల్గొన్నారు.