సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యనిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో ఏకంగా రూ 22 కోట్ల విలువైన 9.6 లక్షల కోట్ల మద్యం, రూ 1.71 కోట్ల నగదు, రూ 8 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల బృందాలు పెద్ద ఎత్తున నగదుతో పాటు రూ 3.11 లక్షల విలువైన 35 కిలోల డ్రగ్స్, 3650 బ్రిటన్ పౌండ్లు, రూ 60,000 విలువైన థాయ్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నాయి.
గుజరాత్‌లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నల్లధనం ఉపయోగించడంపై కన్నేసేందుకు కేంద్ర పరిశీలకులతో పాటు 100 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులను ఈసీ నియమించింది. మరోవైపు బంగారం వ్యాపారాల లావాదేవీలకు సంబంధించిన 311 కిలోల బంగారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అధికారులు విడిచిపెట్టినట్టు ఈసీ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా ఈనెల 9, 14న జరగనున్న విషయం తెలిసిందే. ఈనెల 18న ఓట్ల లెక్కింపు చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment