అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. దావూద్ బంధువుల నుంచి ఆస్తులను స్వాధీన పర్చుకోవాలని భారత ప్రభుత్వానికి సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆస్తులు తమవేనంటూ దావూద్ తల్లి అమీనా బీ, సోదరి హసీనా పర్కార్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ముంబై నాగ్పాదలో దావూద్‌కి చెందిన ఆస్తులు ఉన్నాయి. దేశం విడిచి పారిపోయిన అనంతరం దావూద్ సోదరి, తల్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు.