శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : శంషాబాద్ మండలంలోని గగన్ పహాడ్‌లో 200 డ్రమ్ముల ప్రమాదకర రసాయనాలను, 100 బస్తాల రసాయన పౌడర్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. రసాయనాలను దాచిన గోదాముకు సీల్ వేసి ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు.