కల్లూరు (ఖమ్మం) : అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.