
ఇసుక తరలిస్తున్న 19 ట్రాక్టర్ల పట్టివేత
మంచిర్యాల (ఆదిలాబాద్ జిల్లా) : మంచిర్యాల మండలంలోని గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 19 ట్రాక్టర్లను పోలీసులు గురువారం పట్టుకున్నారు. పోలీసులు రావడం గమనించి కొంతమంది డ్రైవర్లు ట్రాక్టర్లను వదిలి పరారయ్యారు. ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల పట్టణ సీఐ సుధాకర్ తెలిపారు.