ఆత్మకూరు : మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరులో ఫిజీషియన్ శాంపిల్ ఔషధాలను ( రోగులకు ఉచితంగా అందించేందుకు వీలుగా కంపెనీలు వైద్యులకు ఇచ్చేవి) అధికారులు పట్టుకున్నారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ షాపులో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ సిబ్బందితో కలసి మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు రోగులకు ఉచితంగా అందించాల్సిన శాంపిల్ ఔషధాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం వెలుగు చూసింది. రూ.10 లక్షల విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.