శంషాబాద్ (రంగారెడ్డి) : అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 3 లక్షల విలువైన టపాసులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ సాతంరాయ్ బాలాజీ కాంప్లెక్స్‌లో అక్రమంగా టపాసులు నిల్వ ఉంచారనే సమాచారంతో ఆదివారం ఉదయం రంగంలోకి దిగిన పోలీసులు కాంప్లెక్స్‌లో ఉంచిన రూ. 3 లక్షల విలువైన టపాసులను స్వాధీనం చేసుకొని వాటిని నిల్వ ఉంచిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.