
ఆపరేషన్ చేయించి బంగారం స్వాధీనం చేసుకున్నారు!
హైదరాబాద్: అధికారుల కళ్లుగప్పి బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ఓ వ్యక్తి వేసిన ఎత్తుగడ వికటించి జైలుపాలయ్యాడు. అబ్దుల్ హలీమ్ అనే వ్యక్తి 350 గ్రాముల బంగారాన్ని టాబ్లెట్ల రూపంలో తయారు చేసి మింగాడు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన అబ్దుల్ను ఈ నెల 24న శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించి ఆపరేషన్ చేయించారు. వైద్యులు అబ్దుల్కు ఆపరేషన్ చేసి బంగారం బయటకు తీశారు. అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు.