శ్రీదేవి థియేటర్ సమీపంలోని మూడు రోడ్ల కూడలి వద్ద శనివారం అర్థరాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పీఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు స్వాధీనం చేసుకున్నారు.
మక్కువ: శ్రీదేవి థియేటర్ సమీపంలోని మూడు రోడ్ల కూడలి వద్ద శనివారం అర్థరాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పీఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తోటవలస గ్రామం నుంచి సీతానగరం మండలానికి రేషన్ బియ్యాన్ని మేక్స్‌వ్యాన్‌లో తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో మాటువేసి పట్టుకున్నారు.
వ్యాన్‌లో 50 కేజీల సంచుల్లో సుమారు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నింపి టార్పాలిన్ కప్పి తరలిస్తుండగా పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. బియ్యాన్ని తహసీల్దార్‌కు అప్పగిస్తామని పీఎస్‌ఐ తెలిపారు.