rations rice
-
రేషన్ బియ్యం స్వాధీనం
మక్కువ: శ్రీదేవి థియేటర్ సమీపంలోని మూడు రోడ్ల కూడలి వద్ద శనివారం అర్థరాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పీఎస్ఐ పి.రమేష్‌నాయుడు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తోటవలస గ్రామం నుంచి సీతానగరం మండలానికి రేషన్ బియ్యాన్ని మేక్స్వ్యాన్లో తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో మాటువేసి పట్టుకున్నారు. వ్యాన్‌లో 50 కేజీల సంచుల్లో సుమారు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నింపి టార్పాలిన్ కప్పి తరలిస్తుండగా పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. బియ్యాన్ని తహసీల్దార్‌కు అప్పగిస్తామని పీఎస్ఐ తెలిపారు. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
నూజివీడు: పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు చిక్కింది. ఖమ్మం జిల్లా మధిర నుంచి 18 టన్నుల రేషన్ బియ్యంతో వెళుతున్న లారీని శుక్రవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా నూడివీడులో పోలీసులు అడ్డుకున్నారు. సరైన పత్రాలు, వివరాలు వెల్లడించకపోవడంతో అది అక్రమసరుకేనని నిర్ధారించుకున్న పోలీసులు లారీ సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా మండపేటకు తరలిస్తున్నట్లుగా తెలిసింది.