భారీగా రేషన్ బియ్యం పట్టివేత | illegal transporters of rations rice have been caught | Sakshi
Sakshi News home page

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

Published Fri, Sep 11 2015 7:41 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

illegal transporters of rations rice have been caught

నూజివీడు: పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు చిక్కింది. ఖమ్మం జిల్లా మధిర నుంచి 18 టన్నుల రేషన్ బియ్యంతో వెళుతున్న లారీని శుక్రవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా నూడివీడులో పోలీసులు అడ్డుకున్నారు.

సరైన పత్రాలు, వివరాలు వెల్లడించకపోవడంతో అది అక్రమసరుకేనని నిర్ధారించుకున్న పోలీసులు లారీ సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా మండపేటకు తరలిస్తున్నట్లుగా తెలిసింది.

Advertisement

పోల్

Advertisement