
ప్రతీకాత్మక చిత్రం
శంషాబాద్: కస్టమ్స్ సుంకం చెల్లించకుండా వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చిన 80 ఐఫోన్లను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం రాత్రి షార్జా నుంచి జి9458 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులు లగేజీ బెల్టు వద్ద ఓ బ్యాగును వదిలేశారు. కస్టమ్స్ అధికారులు అనుమానించి బ్యాగును తెరిచి చూడగా అందులో సుమారు రూ. 1,00,65,000 విలువ చేసే 80 ఐఫోన్లను గుర్తించారు. బ్యాగును తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులతో పాటు దాన్ని తరలించేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లింగ్‌లో భాగంగా ఐఫోన్లను తీసుకొచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment