
మీసేవా కేంద్రం సీజ్
వినియోగదారుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్న మీసేవా కేంద్రాన్ని సీజ్ చేశారు
షామీర్‌పేట్(మెడ్చల్): వినియోగదారుల నుంచి అధిక డబ్బులు వసూలు చేయడంతో పాటు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న మీసేవా కేంద్రాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మెడ్చల్ జిల్లా షామీర్‌పేట్ మండల కేంద్రంలోని శ్రీ భువనేశ్వరి కమ్యూనికేషన్స్ పేరిట నడుపుతున్న మీసేవా కేంద్రంలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో.. షామీర్‌పేట్ తహశీల్దార్ రవీందర్‌రెడ్డి శుక్రవారం మీసేవా కేంద్రాన్ని సీజ్ చేశారు.