జమ్మికుంట (కరీంనగర్) : కల్తీ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. గాంధీ చౌరస్తా వద్ద ఉన్న లక్కీ వైన్స్‌లో కల్తీ మద్యం అమ్ముతున్నారని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దుకాణాన్ని సీజ్ చేసి షాప్ యాజమని ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఇంట్లో కూడా మద్యం కల్తీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.