రూ. 7వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ పట్టివేత! | Australian police seize huge haul of meth hidden in gel bra inserts | Sakshi
Sakshi News home page

రూ. 7వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ పట్టివేత!

Published Mon, Feb 15 2016 5:39 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

Australian police seize huge haul of meth hidden in gel bra inserts

ఆస్ట్రేలియా చరిత్రలోనే అతి పెద్ద డ్రగ్స్ రాకెట్‌ను అక్కడి పోలీసులు ఛేదించారు. హాంగ్కాంగ్ నుంచి అక్రమంగా ఆస్ట్రేలియాలోకి తీసుకు వచ్చిన 120 లీటర్ల మెతామ్ఫెటమైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ మాఫియా అత్యంత చాకచక్యంగా అమ్మాయిలు ధరించే జెల్ బ్రాలలో డ్రగ్స్ను అక్రమంగా  తీసుకొచ్చారు. నిఘావర్గాల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న మెతామ్ఫెటమైన్ విలువ1 బిలియన్ డాలర్లు (దాదాపు 7 వేల కోట్ల రూపాయలు) ఉంటుందని అంచనా. ఈ సంఘటనతో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక చైనా వ్యక్తితో పాటు ముగ్గురు హాంగ్కాంగ్కు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆస్ట్రేలియా చరిత్రలోనే పట్టుబడిన వాటిలో ఇదే అత్యంత పెద్ద డ్రగ్స్ రాకెట్ అని జస్టిస్ మినిస్టర్ మిచెల్ కినాన్ అన్నారు. సిడ్నీలో సీజ్ చేసిన ద్రవరూపంలో ఉన్న డ్రగ్ నుంచి 500 కిలోల క్రిస్టల్ మెత్ను తయారు చేయొచ్చని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమాండర్ క్రిస్ షీహాన్ తెలిపారు. చైనా అధికారుల సహాయంతో గత కొంత కాలంగా నిఘా పెంచి ఈ మెతామ్ఫెటమైన్ రాకెట్ను ఛేదించగలిగామని తెలిపారు.
 
నిఘావర్గాల సమాచారంతో సిడ్నీలోని మిరండా, హర్స్ట్ విల్లే, పెడాస్టో, కింగ్స్ గ్రూవ్ ప్రాంతాల్లోని గోడౌన్లలోకి వచ్చిన సరుకులను తనిఖీ చేయగా జెల్ బ్రాలతో పాటూ ఇంటి ఉపకరణాలలో నిలువ చేసిన డ్రగ్స్ను కనుగొన్నామని తెలిపారు.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement