పెద్ద మొత్తంలో కల్లును రవాణా చేస్తుండగా రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.
ఘట్‌కేసర్ (రంగారెడ్డి జిల్లా) : పెద్ద మొత్తంలో కల్లును రవాణా చేస్తుండగా రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. నాగరాజు అనే వ్యక్తి 200 లీటర్ల కల్లును ఆటోలో తరలిస్తుండగా సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. నాగరాజును అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా కల్లును రవాణా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.