ఫిల్మ్‌నగర్ పార్క్‌లో రూ. 50 లక్షలు స్వాధీనం
హైదరాబాద్: పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బంజారాహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని ఓ పార్క్‌లో శుక్రవారం పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ చేతులు మారుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.
నగరానికి చెందిన ఓ బడా వ్యక్తి కోసం ఖమ్మం జిల్లా నుంచి రూ. 50 లక్షల కొత్త కరెన్సీ తీసుకొచ్చిన ముఠా సభ్యులు పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకొని బ్లాక్ మనీకి బదులు వైట్ మనీ ఇస్తుండగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.