బిస్కట్ల కోసం బీరువాలోనే ప్రాణాలొదిలింది! | Elderly lady suffocates to death in biscuit hunting accident | Sakshi
Sakshi News home page

బిస్కట్ల కోసం బీరువాలోనే ప్రాణాలొదిలింది!

Published Mon, Dec 21 2015 4:59 PM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM

బిస్కట్ల కోసం బీరువాలోనే ప్రాణాలొదిలింది! - Sakshi

బిస్కట్ల కోసం బీరువాలోనే ప్రాణాలొదిలింది!

ఆ బామ్మకు తీపి అంటే ప్రాణం. కానీ షుగర్ వ్యాధి ఉంది. తీపి తింటే ఆమె ఆరోగ్యానికి ముప్పు. అందుకే ఆమె కొడుకు ఆమెకు ఇష్టమైన బిస్కట్లను అందకుండా దాచిపెట్టాడు. ఓ బీరువాలో వాటిని ఉంచాడు. అయినా ఆ బామ్మ మనస్సు చంపుకోలేదు. బిస్కట్లను వెతికే క్రమంలో బీరువాలో ఇరుక్కుపోయింది. బిస్కట్లు అందాయో లేదో కానీ గాలి మాత్రం అందలేదు. ఊపిరి అందాక బీరువాలోనే ప్రాణాలొదిలేసింది.

ఈ విషాద ఘటన ఈశాన్య ఇటలీలోని ఉడిన్‌లో ఈ ఘటన జరిగింది. కొడుకు దాచిపెట్టిన బిస్కట్లను వెతుకుతూ 84 ఏళ్ల వృద్ధురాలు బీరువాలో ఇరుక్కుపోయింది. శరీరబరువు కారణంగా బీరువాలోని దుస్తుల్లో మధ్య నలిగిపోయిన ఆమె చివరకు శ్వాస ఆడక ప్రాణాలు వదిలింది. స్థానిక అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆమె మృతదేహాన్ని బీరువాలోంచి వెలికి తీశారు. ఈ ఘటన స్థానికంగా ఉన్నవారిని కలిచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement